339 అభివృద్ధి పనులు చేయడం రికార్డ్..ఎమ్మెల్యేపై మంత్రి లోకేష్ ప్రశంసలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-04 12:39:54  IST  )

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి నారాలోకేష్ ప్రశంసలు కురింపించారు.

339 అభివృద్ధి పనులు చేయడం రికార్డ్..ఎమ్మెల్యేపై మంత్రి లోకేష్ ప్రశంసలు
X

దిశ‌, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి నారాలోకేష్ ప్రశంసలు కురింపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఆర్అండ్ బీ, పంచాయితీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేష‌న్ ఇలా ప‌లు రంగాల్లో అనేక త‌క్కువ‌కాలంలోనే అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దీంతో నారాలోకేష్ తన సోష‌ల్ మీడియా ద్వారా శ్రీధ‌ర్ రెడ్డిని అభినందించారు.

నియోజ‌కవ‌ర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన శాస‌న‌స‌భ్యులు కోటంరెడ్డికి ఆయ‌న టీంను అభినంద‌న‌లు అని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేవ‌లం 60 రోజుల్లో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం ఒక రికార్డ్ అని ప్ర‌శంసించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.231 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని అన్నారు. నమ్మి ఓటేసిన ప్రజల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అభివృద్ధి ఫలాలు అందజేస్తున్న మీ కృషి ఆదర్శమని పేర్కొన్నారు.

Next Story