- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఫలితాలు బీహార్ లోనూ రిపీట్ చేస్తాం: నారా లోకేష్
by Ajay Maddhiboyina |
ఏపీ మంత్రి నారాలోకేష్ బీహార్‌లో ఎన్నికల ప్రచారం కోసం నేడు బయలుదేరగా ఆయనకు పాట్నాలో ఘనస్వాగతం పలికారు. బీజేపీ నేతలు ఆయనను కలిసి వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరైన సమయంలో సరైన వ్యక్తి దేశానికి నాయకత్వం వహిస్తారని అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారాలోకేష్ బీహార్‌లో ఎన్నికల ప్రచారం కోసం నేడు బయలుదేరగా ఆయనకు పాట్నాలో ఘనస్వాగతం పలికారు. బీజేపీ నేతలు ఆయనను కలిసి వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరైన సమయంలో సరైన వ్యక్తి దేశానికి నాయకత్వం వహిస్తారని అన్నారు. దేశంలో మోడీ ఉన్నారని, బీహార్ లో నితీష్ కుమార్ ఉన్నారని అన్నారు.
ఆంధ్రరాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీలో 94శాతం సీట్లు సాధించామని, బీహార్‌లో ఏపీ ఫలితాలను రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారతీయుడిగా ఆ ఫలితాలు సాధించేలా చేయడం తన బాధ్యత అని చెప్పారు. వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర కూడా ఉండాలన్నారు. తామంతా కలిసి బీహార్ లో ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి వచ్చామని చెప్పారు.
Next Story






