- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం: నారాలోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అని మంత్రి నారాలోకేష్ అసెంబ్లీలో చెప్పారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే మా నినాదం అని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అని మంత్రి నారాలోకేష్ అసెంబ్లీలో చెప్పారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే మా నినాదం అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి జిల్లాల్లో ఓ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఉందన్నారు. ఎంవోయూలు కుదిరిన 770 ప్రాజెక్టులు జీఓఎమ్ ట్రాక్ చేస్తోందన్నారు.
20 నెలల్లో ప్రభుత్వం 15,87 జాబ్ ఫెయిర్ లు నిర్వహించిందని తెలిపారు. 11,373 కంపెనీలు జాబ్ ఫెయిర్ లో పాల్గొన్నాయని చెప్పారు. లక్షా 8వేల 748మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. రాయలసీమలోని అనంతపూర్ లో ఆటోమోటివ్ క్లస్టర్, కడప మరియు చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అమరవాతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్, ఉత్తరాంధ్రలో ఫార్మ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు.






