- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్ లో నారా లోకేష్.. ఎన్డీఏను గెలిపించాలని పిలుపు
ఎన్డీఏ కూటమికి మద్ధతుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎన్డీఏ కూటమికి మద్ధతుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్ధతుగా పాట్నాలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీహార్ సర్వతోముఖాభివృద్ధి కోసం మరోసారి ఎన్టీఏను గెలిపించాలని బీహార్ యువతకు (Bihar Youth) పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగతున్న ఎన్నికలు భారత రాజకీయాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు.
అవినీతిరహిత పాలన కోసం
స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం బీహార్ లో ఎన్డీఏని గెలిపించాలని మంత్రి అక్కడి ఓటర్లను కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్ రూపురేఖలు మార్చేశారని గుర్తు చేశారు. బీహార్ లో నాని (నరేంద్ర మోడీ జీ, నితీష్ కుమార్ జీ) నాయకత్వం ఉందన్నారు. ఏపీలో నరేంద్ర మోడీ (Narendra Modi), చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) నాయకత్వం ఉందని తెలిపారు. విజన్, సమర్థతతో వారివురూ పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దదన్నారు. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రధానమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రాలకు లాభం
ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలకు లాభం చేకూరుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. తద్వారా కేంద్రబడ్జెట్ లో భారీగా నిధులు పొందవచ్చన్నారు. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోందని వివరించారు. అంతేగాక కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల పాత్ర ఉంటుందన్నారు. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుందని తెలియజేవారు. శాంతిభద్రతలు అదుపులో ఉండడం వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారమేర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
జంగిల్ రాజ్ పోయాక పాట్నా అభివృద్ధి
బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారన్నారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారని ప్రకటించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మొద్దు
బిహార్ ఉప ఎన్నికలో ఒక రాజకీయ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని నారా లోకేష్ అన్నారు. అటువంటి హామీలను నమ్మి బిహార్ యువత మోసపోవద్దని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్టీఏకు అవకాశం ఇచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ ను మరోసారి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యులు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.






