- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan:నారా లోకేష్ బర్త్‌డే.. డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ విషెస్
ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పెట్టుబడులే లక్ష్యంగా దావోస్(Dawos) పర్యటనలో ఉన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పెట్టుబడులే లక్ష్యంగా దావోస్(Dawos) పర్యటనలో ఉన్నారు. అయితే ఈ రోజు(జనవరి 23) నారా లోకేష్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జన్మదిన వేడుకలను టీడీపీ(TDP) శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ట్వీట్ చేశారు. ఈ మేరకు ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి, సోదరసమానులు శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






