అభిమాని ఇంటికి నారా భువనేశ్వరి

by Ajay Maddhiboyina |

చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కుప్పం జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే భువ‌నేశ్వ‌రి అభిమాని ఇంటికి వెళ్లారు. నియోజ‌క‌వ‌ర్గంలోని శాంతిపురం మండ‌లం చెల్దిగానిప‌ల్లిలో టీడీపీ అభిమాని ల‌క్ష్మ‌మ్మ ఇంటికి ఆహ్వానించ‌గా భువ‌నేశ్వ‌రి వెళ్లారు.

అభిమాని ఇంటికి నారా భువనేశ్వరి
X

దిశ, వెబ్ డెస్క్: చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కుప్పం జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే భువ‌నేశ్వ‌రి అభిమాని ఇంటికి వెళ్లారు. నియోజ‌క‌వ‌ర్గంలోని శాంతిపురం మండ‌లం చెల్దిగానిప‌ల్లిలో టీడీపీ అభిమాని ల‌క్ష్మ‌మ్మ ఇంటికి ఆహ్వానించ‌గా భువ‌నేశ్వ‌రి వెళ్లారు. ల‌క్ష్మ‌మ్మ ఇంట్లో టిఫిన్ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం సతీమ‌ణికి ల‌క్ష్మ‌మ్మ కుటుంబం శాలువా క‌ప్పి స‌న్మానం చేసింది.

అనంత‌రం బొట్టు పెట్టి చీర‌ను అందించారు. భువ‌నేశ్వ‌రిని చూసి ల‌క్ష్మ‌మ్మ‌తో పాటు వారి కుటుంబ స‌భ్యులు ఎంతో ఆనంద‌ప‌డ్డారు. చాలాసేప‌టి వ‌ర‌కు భువ‌నేశ్వ‌రి ల‌క్ష్మ‌మ్మ కుటుంబ స‌భ్యుల‌తో ముచ్చటించారు. మ‌రోవైపు ఈ ప‌ర్య‌ట‌న‌లో భువ‌నేశ్వ‌రి ఆర్టీసీ బ‌స్సు ఎక్కారు. ఫ్రీబ‌స్ జ‌ర్నీలో కాసేపు మ‌హిళ‌ల‌తో ముచ్చ‌టించారు. అంతేకాకుండా శాంతిపురంలో మ‌హిళ‌ల నుండి విన‌తులు స్వీక‌రించారు.

Next Story