నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

by Naga Rani Yarlagadda |

దివంగత సీఎం, నటుడు సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత సీఎం, నటుడు సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డిస్టింగ్విష్డ్ అవార్డు వచ్చినట్లు ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా తన సోదరికి అభినందనలు తెలిపారు. ప్రజాసేవ, సామాజిక రంగాల్లో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. ఈ అవార్డు వచ్చిందని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంకులను తన సోదరి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారని, ఈ అత్యున్నత అవార్డు ఆమెను వరించడం గర్వంగా ఉందన్నారు. భువనేశ్వరి మరిన్ని అవార్డులు అందుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

Next Story