Bhuvaneshwari: అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళమిచ్చిన నారా భువనేశ్వరి

by Ramesh Naini |   (  Updated:2026-04-19 12:04:51  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని (ఏప్రిల్ 20) పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు.

Bhuvaneshwari: అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళమిచ్చిన నారా భువనేశ్వరి
X

దిశ; డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని (ఏప్రిల్ 20) పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న క్యాంటీన్ల’ నిర్వహణ కోసం ఆమె ఏకంగా రూ.76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం ద్వారా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించనున్నట్లు వెల్లడించారు.

ఆకలి తీర్చడమే అత్యుత్తమ బహుమతి:

కేవలం రూ.5 లకే అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో పేదలకు గౌరవప్రదంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లు లక్షలాది మంది కడుపు నింపుతున్నాయని భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘సీఎం పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళంగా అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారికి ఇంతకన్నా మంచి బహుమానం ఏమీ ఉండదు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విరాళం చెక్కును అందజేస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు.. సుడిగాలి పర్యటన

Next Story