- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ఘటన.. నేషనల్ హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు
శ్రీశైలంలో ఇటీవల శివస్వాములపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలంలో ఇటీవల శివస్వాములపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు సీరియస్ అయ్యారు. భక్తులపై పోలీసులు అధికార జులుం ప్రదర్శించడం తగదని హెచ్చరించారు. తాజాగా ఈ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివస్వాములపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై నంద్యాల సీనియర్ న్యాయవాది ఫణీంద్రనాథ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీక్షపూర్తిచేసి ఇరుముడితో శివయ్య దర్శనానికి వచ్చిన స్వాములపై లాఠీచార్జ్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, శివస్వాముల దీక్ష విమరణ సమయంలో ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టక పోవడం దారుణన్నారు. పైగా 12 గంటలపాటు స్వాములకు దర్శనం కల్పించకుండా వీఐపీలకు ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దీనిపై పోలీసులు, ఆలయ పాలకమండలిపై న్యాయవాది ఫణీంద్రనాథ్ NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై సంస్థ ఎలా స్పందిస్తుందో, ఎవరిపై చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.






