- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగాదికి నంది అవార్డులు: కందుల దుర్గేష్
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముందుగా సినిమాటోగ్రఫీ, హోంశాఖల నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం జరగనుండగా.. ఇందులో ముఖ్యంగా సినిమా టికెట్ రేట్లు, ఏపీలో షూటింగ్ చేసే సినిమాలు, హై బడ్జెట్ చిత్రాల టికెట్ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.
సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.






