- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం
నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో వెళ్తుండగా రామకృష్ణ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో కారును పక్కనే నిలిపేసి రామకృష్ణ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలిసులు తెలిపారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, నందమూరి కుటుంబసభ్యులు చాలామంది కారు యాక్సిడెంట్‌లో మరణించిన విషయం తెలిసిందే. నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్ రోడ్ యాక్సిడెంట్‌లోనే కన్నుమూశారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి ప్రమాద విషయం తెలిసిన నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






