- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రాణం పోతే మళ్ళీ రాదు’.. రోడ్డు ప్రమాదాల నివారణ పై జెండా ఊపిన నందమూరి నటసింహం
దేశంలో ఏటా సుమారు మూడు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా లక్ష మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. సుమారు 5 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో ఏటా సుమారు మూడు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా లక్ష మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. సుమారు 5 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారు. ప్రమాదాల నివారణ(Prevention of accidents)కు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అతి వేగం, ప్రజల్లో చైతన్యం లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే వాహనం నడిపే వ్యక్తి ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని ఆలోచించకుండా ప్రమాదం జరగకూడదనే ధ్యేయంతో వాహనాన్ని నడపాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలం.
వివరాల్లోకి వెళితే.. రోడ్డు భద్రతా(Road safety) వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణపై హిందూపురం ఎమ్మెల్యే(Hindupuram MLA) నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) జెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులకు ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక సూచనలు చేశారు. బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని ఆయన సలహా ఇచ్చారు. ఈ క్రమంలో ‘ప్రాణం పోతే మళ్ళీ రాదు’ అని.. డ్రైవింగ్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ హెల్మెట్ ధరించి బుల్లెట్ బండిని గురునాథ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు నడిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.






