Ap: పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-02 10:27:55  IST  )

నాగావళ్లి ఎక్స్‌ప్రెస్‌ 20810‌కు పెను ప్రమాదం తప్పింది.....

Ap: పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్
X

దిశ, వెబ్ డెస్క్: నాగావళ్లి ఎక్స్‌ప్రెస్‌(Nagavalli Express)20810‌కు పెను ప్రమాదం తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్(Vizianagaram Railway Station) దాటిన తర్వాత పట్టాలు తప్పింది. హౌరా -రాయపూర్(Howrah-Raipur) లైన్ డివైడ్ అవుతుండగా రైలు చివరి బోగీలు(Bhogis) పట్టాలు తప్పాయి. గార్డు వైపు వెనుకున్న రెండు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో దాదాపు 2 గంటలకు పైగానే రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రైలు నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న విజయనగరం రైల్వే సిబ్బంది.. స్పాట్‌కు వెళ్లి మరమ్మతులు చేశారు. పట్టాలు తప్పిన రెండు బోగీలను రైలు నుంచి పక్కకు తీశారు. అనంతరం యథావిధిగా ప్రయాణికులతో రైలు వెళ్లిపోయింది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి.

Next Story