Nagarjuna Sagar:నిండుకుండలా నాగార్జునసాగర్..భారీగా పోటెత్తుతున్న వరద

by Jakkula.Mamatha |   (  Updated:2024-08-16 14:36:28  IST  )

నాగార్జున సాగర్‌కు వరద క్రమక్రమంగా పెరిగింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది.

Nagarjuna Sagar:నిండుకుండలా నాగార్జునసాగర్..భారీగా పోటెత్తుతున్న వరద
X

దిశ,వెబ్‌డెస్క్:నాగార్జున సాగర్‌కు వరద క్రమక్రమంగా పెరిగింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు భారీగా వరద రావడంతో నాగార్జున సాగర్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. జలాశయంలోని నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారీగా వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ 4 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 590 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 312 టీఎంసీలుగా ఉంది.

Next Story