- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి : ఎమ్మెల్సీ నాగబాబు
పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు.

దిశ, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. మంగళగిరిలో పెనుగొండ సుబ్బారాయుడు నేతృత్వంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్యవైశ్యసంఘ నాయకులు నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరే ముందు నాయకులతో నాగబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సేవ చేసిన మహనీయుల పేర్లు పథకాలకు పెట్టాలని ప్రజాప్రతినిధులంతా ఒక వినతి పత్రం ఇవ్వాలని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకానికి ఒక్క జగనన్న పేరు మాత్రమే పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అలాంటి పద్ధతికి ముగింపు పలికి, రాష్ట్రానికి సేవ చేసిన గొప్పవాళ్ల పేర్లను పథకాలకు పెడుతోందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలకు తాగునీరు అందించే పథకానికి 'అమరజీవి జలధార' అని పేరు పెట్టి డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని నాగబాబు కొనియాడారు.






