అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దు.. ఆ పార్టీ నేత నాగబాబు విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

జనసేన పార్టీ(Janasena party)లో చేరికపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు.

అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దు.. ఆ పార్టీ నేత నాగబాబు విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ(Janasena party)లో చేరికపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నాగబాబు సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి నాగబాబు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దని రిక్వెస్ట్ చేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధమైన వారే రావాలని ఆహ్వానించారు. అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) లక్ష్యాన్ని, ఆశయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు.. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీ(MLC) ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ(Rajya Sabha) సీటును నాగబాబుకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తే.. తమకూ కావాలని బీజేపీ కూడా అడిగే అవకాశం ఉండటంతో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇచ్చి సర్దిచెప్పడానికి సిద్ధమైనట్లు సమాచారం. గతంలో రాష్ట్రానికి రాజ్యసభ పదవులు వచ్చినప్పుడు అవకాశం ఉన్నా.. నాగబాబుకు ఇవ్వకుండా పవన్ కల్యాణ్ పక్కనబెట్టారు. కుటుంబ పార్టీ అనే నింద మోయాల్సి వస్తుందని భావించి ఆరోజు పక్కనబెట్టినట్లు స్వయంగా పవన్ కల్యాణే చెప్పారు.

ప్రస్తుతం నాగాబాబు సైతం విస్తృతంగా జనాల్లో పర్యటించడం, సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తుండటంతో నాగబాబుకు రాజ్యసభ ఇవ్వడం సబబే అని కూటమి పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాగబాబుకు కేబినెట్‌లో ఏ శాఖ ఇస్తుంది అనేదానిపై ఆసక్తికర చర్చ జరిగింది. ఇక ఈ వార్తలకు కూడా చెక్‌ పెట్టాలంటే రాజ్యసభ ఇవ్వడమే మార్గమని భావించిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే కూటమి పెద్దల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story