ఏ పిచ్చిరెడ్డి వచ్చినా భయపడం: నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

ఏ పిచ్చిరెడ్డి వచ్చినా భయపడమని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై నాగబాబు ఫైర్ అయ్యారు...

ఏ పిచ్చిరెడ్డి వచ్చినా భయపడం: నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏ పిచ్చిరెడ్డి వచ్చినా భయపడమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy)పై జనసేన నేత నాగబాబు(Jana Sena leader Nagababu) ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం(Punganur Constituency) సోమల దగ్గర జనసేన పార్టీ చేపట్టిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పుంగనూరులో ‘పెద్దిరెడ్డితో జాగ్రత్త అని ఎన్నికల సమయంలో చెప్పారు. పెద్దిరెడ్డి కాదు.. ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి .. వాళ్ల నా వైఎస్ రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు. పెద్దిరెడ్డి కాదు కదా.. సుబ్బారెడ్డి.. ఏ పిచ్చిరెడ్డి వచ్చినా భయపడం’ అని చెప్పామని ఆయన గుర్తు చేశారు. శాసనసభకు రాని పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు. తిరుపతిలో చెరువులన్నింటిని ఆక్రమించారని మండిపడ్డారు. అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వైసీపీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల వరకూ ఆ పార్టీలో ఎవరూ ఉండరని నాగబాబు జోస్యం చెప్పారు.

Next Story