- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రైతులకు శుభవార్త..ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన
ఏపీ రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతులకు చెల్లింపులు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే, వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి కలెక్టరేట్ లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అధ్యక్షతన సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ పనితీరు మరింత మెరుగుపడాలని సూచించారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామన్నారు. అలాగే ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి ముందస్తుగానే భారీ సంఖ్యలో కూలీలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. తేమ శాతం 17 దాటినా సరే, రైతులను ఇబ్బంది పెట్టకుండా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లను సూచించామని వెల్లడించారు. ధాన్యం సేకరించిన వెంటనే, ఎటువంటి జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు.






