శతాబ్దాల తర్వాత శ్రీవారికి మైసూరు రాజమాత అపూర్వ కానుక

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-19 06:52:00  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే.. తిరుమల (Tirumala) ఏడుకొండలపై వేంచేసియున్న స్వామివారికి శతాబ్దాల కాలం తర్వా భారీ వెండి అఖండ దీపాలు కానుకగా వచ్చాయి.

శతాబ్దాల తర్వాత శ్రీవారికి మైసూరు రాజమాత అపూర్వ కానుక
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే.. తిరుమల (Tirumala) ఏడుకొండలపై వేంచేసియున్న స్వామివారికి శతాబ్దాల కాలం తర్వా భారీ వెండి అఖండ దీపాలు కానుకగా వచ్చాయి. మైసూరు రాజమాత ప్రమోదా దేవి (Mysore Rajamatha Pramoda Devi) సోమవారం ఈ కానుకలను స్వామివారికి సమర్పించారు. ఒక్కో దీపం బరువు సుమారు 50 కిలోలు ఉంటుంది. రెండు దీపాల తయారీకి 100 కిలోల వెండిని వాడినట్లు తెలుస్తోంది. మూడు శతాబ్దాల క్రితం మైసూరు మహారాజు శ్రీవారి ఆలయానికి ఇలాంటి అఖండ దీపాలను విరాళంగా అందించారు. మళ్లీ ఆ రాజవంశం నుంచే వీటిని కానుకగా ఇవ్వడం విశేషం.

రంగనాయకుల మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజమాత శ్రీ ప్రమోదా దేవి ఈ వెండి అఖండాలను టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు (TTD Chairman B.R Naidu), అదనపు కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. వెంకయ్య చౌదరి సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులకు అందజేశారు.

Next Story