- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం : వైఎస్ జగన్
by Naga Rani Yarlagadda |
మన జాతీయ గీతం "వందేమాతరం"ను రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మన జాతీయ గీతం "వందేమాతరం"ను రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ "150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం" అని తెలిపారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్ర్య సమరయోధుల్లో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శమని తెలిపారు. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
జాతీయగేయం వందేమాతరం దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో రణనినాదంగా ఉపయోగపడింది. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రాయగా.. 1882లో బెంగాలీ నవల ఆనందమఠ్ లో తొలిసారి దీనిని ప్రచురించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వందేమాతరంను జాతీయ గీతంగా ప్రకటించారు.
Next Story






