- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా ప్రధాన అజెండా అదే’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

దిశ,వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్ళు, భవిష్యత్తులో MLA అవ్వాలని అనుకుంటున్నా వాళ్లు ముందుకు రావాలని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌లో కార్యకర్తలు నిబద్ధతతో కూడిన వాళ్ళని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను నెత్తిన మీద పెట్టుకొని మోసిన వాళ్ళని ఆమె తెలిపారు. ప్రతి జిల్లాలో వాళ్ల తపన చూస్తే ఎంతో అభిమానం కలిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. గ్రౌండ్ లెవల్‌లో మంచి నాయకత్వం ఉంటే ఆదరించే ప్రజలు కోట్లలో ఉన్నారు. కోట్ల మంది ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని.. అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అని నమ్మకంగా ఉన్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగాల పునాది కాంగ్రెస్ సోనియా గాంధీ తన పదవిని త్యాగం చేసి పార్టీని నడిపించింది. రాహుల్ గాంధీ నేటికి ప్రజల కోసం కొట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలకు నమ్మకం కలిగించే అంశాలు అని తెలిపారు.
ఇవన్నీ ఉన్నా పార్టీ దగ్గర రిసోర్సెస్ లేవు. కాంగ్రెస్ పార్టీ దగ్గర రిసోర్సెస్ ఉంటే రాష్ట్రంలో పెద్ద ఫోర్స్ గా ఎదగగలదు. కాంగ్రెస్ సిద్ధాంతాలు గౌరవించే వాళ్ళు, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని వెళ్ళే వాళ్ళు,YSR ఆశయాలను నిలబెట్టే వాళ్లు కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది. చేరికలకు నేను పూచి. నాకు కాంగ్రెస్ అభివృద్ధి ఒక్కటే అజెండా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలి. దేశంలో రాహుల్ ప్రధాని అవ్వాలి. ఆంధ్రాలో కాంగ్రెస్ అధికారంలో వస్తే విభజన హామీలు అమలు అవుతాయి. ప్రజాసేవ చేయాలని అనుకున్న వాళ్ళు ముందుకు రండి చివరి నిమిషంలో వచ్చి టికెట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి పోరాటాలు చేస్తేనే ఎన్నికల నాటికి నాయకుడుగా ఎదుగుతారు. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఉంది. భాష, ప్రాంతం అని విభేదాలు ఉండవు. ఏ సమస్య వచ్చినా ఢిల్లీ దాకా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడపాలి అంటే రిసోర్సెస్ కావాలి. ఏ పార్టీ అయినా నడవాలి అంటే అన్ని రకాల రిసోర్సెస్ కావాలి. కాంగ్రెస్ దగ్గర రిసోర్సెస్ మినహా అన్ని ఉన్నాయి. అందరం కలిసి బెటర్ ఇండియా చేద్దాం. ఆంధ్రా రాష్ట్ర విభజన కాంగ్రెస్ ది తప్పు కాదు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర విభజన చేయలేదు. అందరూ ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన జరిగింది. చిన్నమ్మ అని చెప్పి బీజేపీ రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చింది. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాలేదు. అప్పుడే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే విభజన హామీలు నెరవేరేవని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. రాజధాని నిర్మాణం అయ్యేదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.






