మా అన్నని చంపింది కోట వినుత వర్గీయులే.. రాయుడి చెల్లి సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోటి వినుత (Kota Vinutha) సహాయకుడు రాయుడు అలియాస్ శ్రీనివాస్ మర్డర్ కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మా అన్నని చంపింది కోట వినుత వర్గీయులే.. రాయుడి చెల్లి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోటి వినుత (Kota Vinutha) సహాయకుడు రాయుడు అలియాస్ శ్రీనివాస్ మర్డర్ కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే వినుతను జనసేన పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన అన్న రాయుడు హత్యపై ఆమె చెల్లెలు ఇవాళ మరో సంచలన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తన అన్నతో అన్ని పనులు చేయించుకుని.. కనికరం లేకుండా కోటి వినుత వర్గీయులే కడతేర్చారని ఆరోపించింది. ఆ నేరాన్ని కావాలనే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) మీదకు నెట్టుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం మూడో కంటికి తెలియకుండా తన అన్నను మాయం చేశారని పేర్కొంది. తన అన్న హత్యపై రూ.లక్షలు ఖర్చు పెట్టి పెయిడ్ వీడియోలు చేయిస్తున్నారని.. అన్న బతికి ఉన్నప్పుడు బెదిరించి వీడియో తీపించారని ఆరోపించింది. రాయుడు వాడిన మొబైల్‌ను వెంటనే తమకు హ్యాండోవర్ చేయాలని ఆయన చెల్లెలు డిమాండ్ చేసింది.

Next Story