- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏపీ హైకోర్టులో జోగి రమేశ్ పిటిషన్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు (Mulakalacheruvu) నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు (Mulakalacheruvu) నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడు జనార్దన్ రావు (Janardhan Rao)తో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh)కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ హైకోర్టు (AP High Court)లో పటిషన్ దాఖలు చేశారు. నకిలీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో కోరారు.
కాగా, అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ బహిర్గతమైన విషయం సెన్సేషన్ సృష్టించింది. అయితే, కేసులో సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు (A1)తో పాటు టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆరోపణలు రాజకీయ ఘర్షణకు దారి తీశాయి. కేసులో ఎక్సైజ్ పోలీసులు ఇప్పటి వరకు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, మెటీరియల్‌ను కూడా సీజ్ చేశారు. మొత్తం 23 మంది నిందితులు గుర్తించి అందులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.






