టీటీడీ ఈఓ బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

by Naga Rani Yarlagadda |

టీటీడీ ఈఓగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో అదనపు ఈఓ ప్రమాణ స్వీకారం చేయించారు.

టీటీడీ ఈఓ బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థాన ఈఓగా ఇటీవల ముద్దాడ రవిచంద్ర నియమితులైన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకోగా.. నూతన ఈఓ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదఆశీర్వచనం చేశారు. అదనపు ఈఓ వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. నెలరోజులుగా తిరుమలలో చాలా విషయాలను గమనించి, కొత్త విషయాలను నేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే దర్శనాలు, వసతిపై భక్తుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను స్వయంగా పరిశీలించి వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Next Story