- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఎస్ఎంఈలు చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చేస్తాయి: సీఎం చంద్రబాబు
ఎంఎస్ఎంఈలు చిన్న ఆలోచనను కూడా పెద్ద వ్యాపార పరిశ్రమగా మార్చేస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్ఎంఈలు చిన్న ఆలోచనను కూడా పెద్ద వ్యాపార పరిశ్రమగా మార్చేస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. ఆర్టీఐహెచ్ లోని కొన్ని స్టార్టప్ సంస్థలు తయారు చేసిన టెక్నాలజీ ఎనేబుల్డ్ హ్యాండ్, వీరపనేనిగూడెంలో డిఫెన్స్ ఉత్పత్తులు, మచిలీపట్నంలోని బీహెచ్ఈఎల్ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉత్పత్తుల్ని తిలకించారు. అలాగే డ్రోన్ బోట్స్ సహా గిరిజనులు సాగు చేస్తోన్న కొండ చీపురు గడ్డి ఉత్పత్తులను సీఎం పరిశీలించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలకు ఉపాధి కల్పిస్తోన్న రంగం ఏదైనా ఉందంటే.. అది MSMEనే అని సీఎం పేర్కొన్నారు. ఏపీలో ఉన్న వనరులను వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయాలని, ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ కింద పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈల కోసం ఇప్పటికే రూ.500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేశామని, రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 38 పార్కులతో పాటు మరో 100 పార్కులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఆయన వెల్లడించారు. పారిశ్రామిక పార్కుల కోసం భూములిచ్చిన రైతులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.






