కోరిక తీర్చమని VRO ను వేధించిన MRO.. చెప్పు, చీపురుతో కొట్టిన తల్లి

by Muthe.Rajitha |

తన కోరిక తీర్చిమని గ్రామ రెవెన్యూ అధికారిణి(VRO) వేధించాడు ఓ ఎమ్మార్వో (MRO). అంతటితో ఆగకుండా ఇంటికి వెళ్లి మరీ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కోరిక తీర్చమని VRO ను వేధించిన MRO.. చెప్పు, చీపురుతో కొట్టిన తల్లి
X

దిశ, వెబ్ డెస్క్ : తన కోరిక తీర్చిమని గ్రామ రెవెన్యూ అధికారిణి(VRO) వేధించాడు ఓ ఎమ్మార్వో (MRO). అంతటితో ఆగకుండా ఇంటికి వెళ్లి మరీ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ను మండల రెవెన్యూ ఆఫీసర్ లైంగికంగా వేధించాడు. ఎమ్మార్వో కొన్నేళ్లుగా మహిళా వీఆర్నువో వేధిస్తూ, ఫోన్లో అసభ్య మెసేజులు పంపినట్లు తెలుస్తోంది. 'మీ ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?' అంటూ మెసేజెస్ చేయడమే కాకుండా బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని, నగ్నంగా నిలబడి వేధించాడు.

ఆగ్రహించిన ఆ అధికారిణి తల్లి ఎమ్మార్వోను చెప్పు, చీపురుతో చితకబాదింది. దీంతో ఎమ్మార్వో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు సమాచారం. తన కిందిస్థాయి అధికారిని లైంగికంగా వేధించిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.

Next Story