- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తులసిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన MP Vijayasai Reddy
విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

దిశ, ఉత్తరాంధ్ర (ఎలమంచిలి): విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. శుక్రవారం ఎలమంచిలి లోని తులసిరావు నివాసానికి విజయసాయిరెడ్డితో పాటు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తులసిరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తులసిరావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తులసిరావు కుమారుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్, కుమార్తె పిల్లా రమాకుమారిని విజయసాయిరెడ్డి ఓదార్చారు. తులసిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎంఎల్సీ వంశీక్రిష్ణ యాదవ్, వరుదు కళ్యాణి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తదితరులు ఉన్నారు.






