నోరు అదుపులో పెట్టుకోండి.. ఈసారి డిపాజిట్లు కూడా రావు : ఎంపీ భరత్

by Naga Rani Yarlagadda |

విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు భూ కేటాయింపులు చేయడాన్ని తప్పుపట్టిన వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీ శ్రీభరత్ (MP Bharath) ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోరు అదుపులో పెట్టుకోండి.. ఈసారి డిపాజిట్లు కూడా రావు : ఎంపీ భరత్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు భూ కేటాయింపులు చేయడాన్ని తప్పుపట్టిన వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీ శ్రీభరత్ (MP Bharath) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరం అభివృద్ధి చెందడం, యువతకు ఉద్యోగాలు రావడం వైసీపీకి ఇష్టం లేదని, అందుకే ఐటీ సంస్థలు రాకుండా అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీసీఎస్ (TCS) సంస్థ మరో ప్రాంతానికి వెళ్తుంటే.. విశాఖలో తక్కువకే భూములిచ్చి ఇక్కడే బ్రాంచ్ ను పెట్టిస్తున్నామని తెలిపారు. టీసీఎస్ వంటి ఐటీ కంపెనీ విశాఖకు వస్తే.. దాని వెనుకే ఇతర ఐటీ సంస్థలు కూడా వస్తాయన్న లాజిక్ వైసీపీ నేతలకు అర్థం కావట్లేదన్నారు. తక్కువ ధరకే కంపెనీలకు భూములిస్తున్నామన్నదానికంటే రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే ఈసారి డిపాజిట్లు కూడా రావని ఎంపీ శ్రీభరత్ అన్నారు.

Next Story