- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్లపై లోక్ సభ వేదికగా ఎంపీ శబరి కీలక వ్యాఖ్యలు
మహిళలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని లోక్ సభ వేదికంగా ఎంపీ శబరి గుర్తు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: మహిళల(Women)కు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అని లోక్ సభ వేదికంగా ఎంపీ శబరి(Mp Sabari) గుర్తు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లోక్ సభ(Lokh Sabha)లో పెట్టిన బిల్లుపై ఆమె ప్రసంగించారు. ఏపీ(Ap)లో మహిళలకు టీడీపీ(Tdp) చాలా ప్రాధాన్యత ఇచ్చిందని, ఆస్తిలో వాటా కల్పించిందని శబరి తెలిపారు. తిరుపతి(Tirupati)లో మహిళా యూనివర్సిటీని ఎన్టీఆర్(Ntr) ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టులు కూడా నిర్మించినట్లు ఆమె తెలిపారు. దేశంలోనే డ్వాక్రా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. ఏపీలోనే అత్యధికంగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని శబరి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను తయారు చేశామని చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించామని ఎంపీ శబరి పేర్కొన్నారు.






