‘వారి పై చర్యలు తప్పవు’.. ఎంపీ పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

మధురపూడి(రాజమహేంద్రవరం) విమానాశ్రయం(Airport)లో టెర్మినల్ భవన నిర్మాణం(Construction of terminal building) జరుగుతోంది.

‘వారి పై చర్యలు తప్పవు’.. ఎంపీ పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: మధురపూడి(రాజమహేంద్రవరం) విమానాశ్రయం(Airport)లో టెర్మినల్ భవన నిర్మాణం(Construction of terminal building) జరుగుతోంది. ఈ క్రమంలో టెర్మినల్ భవన నిర్మాణంలో ఇనుప కడ్డీలు ఊడిపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ పురందేశ్వరి(MP Purandeshwari) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కూలిన సమయంలో కార్మికులు ఎవరూ లేరు కాబట్టి ప్రమాదం తప్పిందన్నారు. నిర్మాణ పనులు చేస్తున్న ప్రాజెక్టు అధికారులను ఎంపీ నిలదీశారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి(Union Minister of Civil Aviation) రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)తో మాట్లాడినట్లు పురందేశ్వరి తెలిపారు. ఈ ఘటనపై విమానయాన శాఖ అధికారులు, ఐఐటీ నిపుణుల బృందం విచారణ చేస్తోందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నివేదిక వచ్చాక నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు ఉంటాయని ఎంపీ పురందేశ్వరి స్పష్టం చేశారు.

Next Story