Rajahmundry: సెంట్రల్ జైలులో లొంగిపోయిన ఎంపీ మిథున్ రెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-11 11:54:10  IST  )

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డి లొంగిపోయారు...

Rajahmundry: సెంట్రల్ జైలులో లొంగిపోయిన ఎంపీ మిథున్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry)లో ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy) లొంగిపోయారు. లిక్కర్ స్కాం కేసు(Liquor scam case)లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు రెండు రోజుల క్రితం విజయవాడ ఏసీబీ కోర్టు(Liquor scam case) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిథున్ రెడ్డి ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ బెయిల్ గడువు నిన్నటితో ముగిసిపోయింది. దీంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు.

కాగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోర్టు కల్పించింది. ఈ మేరకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డి లొంగిపోయారు.

Next Story