- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా వంతు సహకారం అందిస్తా: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి అంశాల పై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు భేటీ అయ్యారు. ..

దిశ, నరసరావుపేట ప్రతినిధి: నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి అంశాల పై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,పెండింగ్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు.
నిధులు మంజూరు చేయించాలి..
ముఖ్యంగా రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని ఎంపీని ఎమ్మెల్యే చదలవాడ కోరారు. దీనికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు సాగాలని నేతలు అభిప్రాయపడ్డారు.






