- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిపెండెంట్‌గా అయిన బరిలోకి దిగుతా: టీడీపీకి కేశినేని పరోక్ష సవాల్
by Satheesh |
గత కొంతకాలంగా టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తుందా.. నేను ఎంపీ అవుతానా.. అనే భయం తనకు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని తెలుగు దేశం పార్టీ అధిష్టానానికి పరోక్షంగా సవాల్ విసిరారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా తనకు ఇబ్బంది లేదని కేశినేని తేల్చి చెప్పారు. తనకు ఓ ట్రాక్ రికార్డు ఉందని.. నేను చేసినన్ని పనులు దేశంలో ఏ ఎంపీ చేయలేదన్నారు. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేస్తానేమో.. నా మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల్ని టీడీపీ ఎలా తీసుకున్నా తనకు భయం లేదని కేశినేని పేర్కొన్నారు.
Next Story






