తిరువూరు పంచాయితీలో బిగ్ ట్విస్ట్.. అధిష్టానం పిలవలేదని ఎంపీ చిన్ని ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-23 13:46:31  IST  )

తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రాలేదని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు...

తిరువూరు పంచాయితీలో బిగ్ ట్విస్ట్.. అధిష్టానం పిలవలేదని ఎంపీ చిన్ని ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(Vijayawada Mp Kesineni Chinni), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్(Tiruvuru Mla Kolikapudi Srinivas) మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుపై తెలుగుదేశం పార్టీ(Telugudesam Party) అధిష్టానం సీరియస్ అయిందని, ఇద్దరూ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశించిందని విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలపై ఎంపీ చిన్ని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాలేదన్నారు. ఎవరూ పార్టీ ఆఫీసుకి రమ్మని చెప్పలేదని తెలిపారు. తనపై ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెప్పారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిని అధిష్టానం రమ్మని చెప్పారేమో తనకు సమాచారం లేదని ఎంపీ కేశినేని చిన్నిపేర్కొన్నారు.

కాగా 2024 ఎన్నికలకు ముందు తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని కేశినేని చిన్ని డిమాండ్ చేశారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు చేశారు. రెండు విడతలుగా రూ.60 లక్షలు చెల్లించానని, చిన్ని పీఏ మోహన్ రూ.50 లక్షలు తీసుకెళ్లారని తెలిపారు. దీంతో కేశినేని చిన్ని కూడా స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు డబ్బులు తీసుకుని సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. కొలికపూడి ఎవరి పంచన ఉండి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అందరికీ తెలుసని తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధిష్టానం ఇరువురికి ఫోన్ చేసి శుక్రవారం పార్టీ కార్యాలయానికి పిలుపునిచ్చింది. అయితే తనకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని కేశినేని చిన్ని తెలిపారు. మరి కొలికపూడికి ఫోన్ కాల్ వచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

Next Story