- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను నిరూపిస్తా.. జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’.. MP సీఎం రమేశ్ సంచలన సవాల్
లిక్కర్ స్కామ్(Liquor Scam)పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్(MP CM Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్(Liquor Scam)పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్(MP CM Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ దోపిడీకి సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలుసు అని.. నిరూపిస్తే రాజకీయాల నుంచి జగన్(Jagan) తప్పుకుంటారా? అని సంచలన సవాల్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. గత ప్రభుత్వం రాజధానుల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. అన్ని ప్రభుత్వ బ్యాంకుల కార్యాలయాలు ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని అన్నారు. అతి త్వరలోనే అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఖాయమని తెలిపారు. అంతేకాదు.. అమరావతిలో భూముల విలువ కూడా భారీగా పెరుగుతోందని అన్నారు. పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు.
మరోవైపు.. మొన్న లిక్కర్ స్కామ్‌పై జగన్ మాట్లాడుతూ.. హాట్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని జగన్ మండిపడ్డారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. ఏపీలో రకరకాల బ్రాండ్‌ల మధ్యం అమ్ముతున్నారని, ఆ పేర్లు గతంలో ఎప్పుడూ వినలేదంటూ కొన్ని పేపర్లు చూపించారని జగన్ విమర్శించారు. లిక్కర్ కేసు పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని, అరెస్టైన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రమేశ్.. జగన్‌పై ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






