నిజాలు తేల్చండి: సీఎం చంద్రబాబుకు ఎంపీ విన్నపం

by Vemula.Srinu Prasad |

తమిళనాడు బోట్ల విడుదల వివాదంలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రజాసేవలో నిమగ్నమైన తనపై నిరాధారమైన విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ..

నిజాలు తేల్చండి: సీఎం చంద్రబాబుకు ఎంపీ విన్నపం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు బోట్ల విడుదల(Tamilnadu Boats Release) వివాదంలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు(Rajya Sabha member Bida Mastan Rao) స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రజాసేవలో నిమగ్నమైన తనపై నిరాధారమైన విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ వివాదంపై అధికారులు, మత్స్యకార పెద్దలు తనతో ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. అసలు వాస్తవాలు వేరే ఉన్నాయని బీద మస్తాన్ రావు పేర్కొన్నారు.

బోట్ల వివాదంపై సమగ్ర దర్యాప్తు జరిపాలి

బోట్ల వివాదంపై సమగ్ర దర్యాప్తు జరిపాలని, వాస్తవాలను గుర్తించాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu)ను, ఉన్నతాధికారులను బీదా మస్తాన్ రావు కోరారు. కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా ప్రధాని మోడీ(Pm Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), కేంద్ర మత్స్యశాఖ మంత్రి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. నిజానిజాలు వెలికితీసి ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీదా మస్తాన్ రావు డిమాండ్ చేశారు.

వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

మత్స్యకారుల సంక్షేమం కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, వాళ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని బీద మస్తాన్ రావు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఉన్న ఆరోపణలు తప్పని విచారణ ద్వారా తెలుస్తాయని బీదా మస్తాన్ రావు స్పష్టం చేశారు.

Next Story