- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్
మహానాడు పేరుతో పులివెందులలో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుపై టీడీపీ నేతలతో పాటూ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మహానాడు పేరుతో పులివెందులలో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుపై టీడీపీ నేతలతో పాటూ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. కానీ ఎక్కడా అభివృద్ధి ఊసే ఎత్తలేదని విమర్శించారు. మహానాడులో ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమీ లేవని అన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చు పెట్టి భజన చేసుకుంటున్నారని విమర్శించారు. అన్ని హామీలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు.
జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాలకు సైతం టీడీపీ నేతలు తమ పార్టీ జెండాలను కట్టారని మండిపడ్డారు. ఆ జెండాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకే వైఎస్ఆర్ విగ్రహాల వద్ద గుంపులుగా టీడీపీ కార్యకర్తలు ఉంటున్నారని విమర్శించారు. టీడీపీ కవ్వింపు చర్యలతో పులివెందులలో ఉద్రిక్తత నెలకొందని అన్నారు. కూటమి నేతల్లారా రోజులు లెక్క పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు అంటూ అవినాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.






