వివేకా గుండెపోటు స్టోరీ పుట్టించిందే సునీతారెడ్డి: ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డికి గుండె పోటు పుట్టించిందే సునీతారెడ్డి అని ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

వివేకా గుండెపోటు స్టోరీ పుట్టించిందే సునీతారెడ్డి: ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి(Ys Vivekanandareddy)కి గుండె పోటు పుట్టించిందే సునీతారెడ్డి(Sunitareddy) అని ఎంపీ అవినాశ్ రెడ్డి(Mp Avinash Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య విషయంలో అన్యాయం జరిగిందంటూ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వివేకా హత్య కేసు విచారణ అడ్డుకుంటుంది సునీతారెడ్డేనని అవినాశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. వివేకాను ఆయన కుటుంబమే వదలేసిందని మండిపడ్డారు. దస్తగిరి వాంగ్మూలంపై దర్యాప్తు జరపమని సునీత ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు. వివేకానందారెడ్డి హత్య వెనుక సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రెండో భార్య శమీమ్‌పై అనుమానాలున్నాయన్నారు. తాను ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తానని ఎంపీ అవినాశ్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

Next Story