- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు.. పులివెందులలో ఎంపీ అవినాశ్ భారీ ర్యాలీ
కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ‘వెన్నుపోటు’ దినం(Vennupotu) పేరిట రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ(Ycp) నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కడప జిల్లా పులివెందుల(Pulivenduala)లో ఎంపీ అవినాశ్ రెడ్డి(Mp Avinash Reddy) ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పారని.. ఇప్పుడు చంద్రబాబు షూరిటీ- మోసం గ్యారంటీ అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో తాము మూడు లక్షల కోట్టు మాత్రమే అప్పు చేశామని, కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిలో 55 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సు, రైతులకు ఏడాదికి రూ. 20 వేలు, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 సీట్లను కూడా వెనక్కి పంపారని ధ్వజమెత్తారు. పులివెందులలో జగన్ ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 10 శాత పనులు కూడా చేయలేకపోయిందని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు.






