మా అభ్యర్థిని గెలిపించండి: ఎంపీ అవినాశ్ రెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-30 11:23:36  IST  )

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు...

మా అభ్యర్థిని గెలిపించండి: ఎంపీ అవినాశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC elections) ప్రచారాన్ని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు. తమ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి(Former ZPTC Maheshwar Reddy) కుటుంబానికి సీటు కేటాయించామని, వైసీపీ ఎంపీటీసీలు సహకరించాలని కోరారు. ఈ రోజు మహేశ్ కుటుంబం నుంచి రెండు నామినేషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఎంపీ అవినాశ్ రెడ్డి కీలక పిలుపు నిచ్చారు.


కాగా గత ఎన్నికల్లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. అయితే ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఈ స్థానాన్ని భర్తీ చేస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్టు 1 సాయంత్రం వరకూ ఈ నామినేషన్లను స్వీకరించనుంది. 5వ తేదీ మధ్యాహ్నం 3లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించింది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ఫైనల్ లిస్టు విడుదల చేయనుంది. 12న పోలింగ్ నిర్వహించనుంది. 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితం వెల్లడించనుంది.

Next Story