- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు.. మహానాడులో నారా లోకేశ్ ఫైర్
అసెంబ్లీ (Assembly) సాక్షిగా గత ప్రభుత్వం హయాంలో తల్లులను అవమానించారని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సాక్షిగా గత ప్రభుత్వం హయాంలో తల్లులను అవమానించారని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు. ఇవాళ మహానాడు (Mahaanadu)లో తొలి రోజు ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం పోరాడుతోంది కేవలం టీడీపీ (TDP)నేని అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా.., పేదల సేవల్లో సోషల్ రీ ఇంజినీరంగ్, కార్యకర్తలే అధినేత అంటూ నాయకులు, కార్యకర్తలకు సూత్రాలను వివరించారు. ఆ ఆరు శానసాలను భవిష్యత్తులో తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని.. సొంత తల్లి, చెల్లిని గెంటేశారంటూ జగన్ (Jagan)ను ఉద్దేశించి సెట్లైర్లు వేశారు. అవమానించిన వాళ్ల పరిస్థితి ఏమైంది.. ‘మీకు అర్థమైందా రాజా’ అంటూ కామెంట్ చేశారు. ఎత్తిన పసుపు జెండా దింపకుండా, పోరాడిన కార్యకర్తలకు ఆయన పాదాభివందనం చేశారు. ఎన్టీఆర్ (NTR) పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిదని అన్నారు. టీడీపీ అంటేనే అన్నదాతకు అండ, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ అని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలతో అనేక పార్టీలు పుట్టాయని.. ప్రజా సంక్షేమానికి పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు.
43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశామని.. తమకు ప్రతిపక్షం కొత్త కాదని.. అధికారం కొత్త కాదన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) నుంచి ప్రతి కార్యకర్త పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. పార్టీలో చర్చ జరగాలని.. ప్రజలకు మరింత దగ్గరవ్వాలని నాయకులు, కార్యక్తలకు పిలుపునిచ్చారు. ప్రణాళికలు సిద్ధం చేసి మరో 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించడానికి మహానాడులో చర్చించాలని అన్నారు. మారుతున్న ప్రజా అవకసరాలకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవ నినాదం, ఆత్మవిశ్వాసంతో చంద్రన్న హయాంలో ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిద్దామని నారా లోకేశ్ అన్నారు.






