విషాదం.. పిడుగుపాటుకు తల్లీకూతుళ్ల మృతి

by Vemula.Srinu Prasad |

ప్రకృతి ప్రకోపానికి శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్దకేసుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బలవ్వడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది....

విషాదం.. పిడుగుపాటుకు తల్లీకూతుళ్ల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి ప్రకోపానికి శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) మందస మండలం పెద్దకేసుపురం(Peddakesapuram) గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బలవ్వడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా వాతావరణం మారింది. వెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపడటంతో తల్లి కృష్ణవేణి, ఆమె కుమార్తె యోగేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లెదుటే ఇద్దరు సభ్యులు విగతజీవులుగా పడి ఉండటంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఒక్కసారిగా దిగ్భ్రాంతి

ఈ ఘటనతో పెద్దకేసుపురం గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పొలం పనుల్లో ఉన్న సమయంలోనో లేదా ఇంటి సమీపంలో ఉన్నప్పుడో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆకస్మికంగా కురిసిన పిడుగు తల్లీకూతుళ్ల ప్రాణాలను బలి తీసుకోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

Next Story