అనంతపురంలో విషాదం.. తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |

అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నం చేశారు..

అనంతపురంలో విషాదం.. తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Ananthapuram)లో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నంsuicide attempt ) చేశారు. దీంతో వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కుమార్తె హారతి మృతి చెందారు. తల్లి లక్ష్మీదేవికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణం కుటుంబ కలహాలేనని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేశారు. కుమార్తె హారతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, అలా చేసి కుటుంబాలకు క్షోభ మిగిల్చవద్దని పోలీసులు తెలిపారు. ప్రజా సేవకోసం తామెప్పుడూ సిద్దంగా ఉంటామని తెలిపారు.

Next Story