Deep Sorrow: క్షణికావేశం.. రెండు ప్రాణాలు పణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-25 13:00:40  IST  )

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యయత్నం చేసింది...

Deep Sorrow: క్షణికావేశం.. రెండు ప్రాణాలు పణం
X

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యయత్నం(Suicide Attempt) చేసింది. ఈ ఘటన విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలస(Tagarapu Valasa)లో జరిగింది. తగరపువలసలో మాధవి కుటుంబం ఉంటోంది. మాధవికి ఇద్దరు పిల్లలున్నారు. రోజూ మాదిరిగా కుటుంబ సభ్యులతో కలసి ఆమె సంతోషంగా ఉన్నారని బంధువులు అనుకున్నారు. అయితే పిడుగులాంటి విని ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. హుటాహుటిన తగరపు వలసకు బయల్దేరి వెళ్లారు. తల్లి, రెండేళ్ల పాప మృతదేహాలను చూసి తీవ్ర దుఖం(Deep sorrow)లో మునిగిపోయారు.


వివరాల్లోకి వెళ్తే... తగరపువలసలో ఇద్దరు పిల్లలకు పురుగుమందు(Pesticide) తాగించి తల్లి మాధవి కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో తల్లి మాధవితో పాటు రెండేళ్ల పాప మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మాధవి, రెండెళ్ల పాప మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కుటుంబ సమస్యలుంటే తమను సంప్రదించాలని, పరిష్కరిస్తామని తెలిపారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ముక్కు పచ్చలారని చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టొద్దని పేర్కొన్నారు.

Next Story