criminals: అతనిపై వందకు పైగా కేసులు.. ఇద్దరు కొడుకులూ నేరస్తులే పోలీసులపైనా దాడి చేసే క్రిమినల్స్.. చివరికి దొరికాడిలా

by Thanuru Gopichand |

వందకుపైగా కేసులు, పలు కేసుల్లో జైలు జీవితం అనుభవించాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..

criminals: అతనిపై వందకు పైగా కేసులు.. ఇద్దరు కొడుకులూ నేరస్తులే  పోలీసులపైనా దాడి చేసే క్రిమినల్స్.. చివరికి దొరికాడిలా
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: వందకుపైగా కేసులు, పలు కేసుల్లో జైలు జీవితం అనుభవించాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లాకు చెందిన రౌతు మల్లేష్​వివిధ జిల్లాల్లో దొంగతనాలకు (thefts) పాల్పడ్డాడు. అతనిపై వందకు పైగా కేసులు ఉన్నాయి. 66 కేసుల్లో విచారణ సాగుతోంది. చాలా కాలం జైలు జీవితం కూడా పడిపాడు. నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అతను పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితో పాటు నర్సీపట్నంకు చెందిన గెడ్డం రామ్ నవీన్ ఏజెన్సీ నుంచి గంజాయిని (ganja) కొనుగోలు చేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా దొరికిపోయారు. వారి నుంచి 22 కేజీలు గంజాయి, 138 గ్రాముల బంగారం, 20తులాల వెండి, 45 వేల నగదు, ఒక స్కూటీ, కత్తులు, రాడ్డులతో పాటు మూడు సెల్ ఫోన్లు పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రౌతు మల్లేష్ మీద గాజువాక పోలీస్ స్టేషన్లో గుమ్మాని సీట్ ఓపెన్ చేశారు. ఇతను క్రూరత్వం కలిగిన మనిషని .. పోలీసులు అరెస్టు చేయడానికి వెళితే వారిపై కూడా దాడి చేస్తాడని, చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటాడని డీఎస్పీ (dsp) వెల్లడించారు. ఇటీవల నర్సీపట్నం ఎస్సీ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలోనూ, అంబులెన్స్ ఆటోలను కూడా ధ్వంసం చేసిన ఘటనలోనూ మల్లేష్ నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఇతను నర్సీపట్నం పోలీసులు మీద కూడా దాడి చేశాడని తెలిపారు. మల్లేష్ ఇద్దరు కుమారులు కూడా నేర ప్రవృత్తి కలవారని వీరు కూడా పలు హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిలుగా ఉండి ప్రస్తుతం రిమాండ్ (remand) లో ఉన్నట్లు వెల్లడించారు.

Next Story