- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:‘ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకం’.. ఆ ఫొటో షేర్ చేసిన మంత్రి
ఏపీ(Andhra Pradesh) మంత్రి నారా లోకేష్(Minister Nara lokesh) తన కుమారుడు దేవాంశ్ చదువుతున్న పాఠశాలలో పేరెంట్ -టీచర్ మీటింగ్ కు హాజరయ్యారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) మంత్రి నారా లోకేష్(Minister Nara lokesh) తన కుమారుడు దేవాన్ష్ చదువుతున్న పాఠశాలలో పేరెంట్ -టీచర్ మీటింగ్ కు హాజరయ్యారు. సతీమణి బ్రాహ్మణి(Nara Brahmani)తో కలిసి వెళ్లిన ఫొటోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో తండ్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఒక రోజు సెలవు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. తన కుమారుడు దేవాన్ష్(Devansh) స్కూల్‌లో పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ తరుణంలో తల్లిదండ్రులుగా పిల్లల విద్య, వారి భవిష్యత్తు పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని మంత్రి లోకేష్ అన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలకు సమయం కేటాయించడం వల్ల మనం వారి పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నామో తెలుస్తుంది. ప్రజా జీవితంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో ఇలాంటి క్షణాలు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయని పేర్కొన్నారు. దేవాన్ష్ నవ్వు, చెప్పే ముచ్చట్లు తండ్రిగా సంతోషాన్నిస్తాయని తెలిపారు. కుమారుడిని చూసి గర్వ పడుతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు.






