ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Naga Rani Yarlagadda |

విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షసూచన చేసింది.

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేడు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షసూచన చేసింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తరు వర్షసూచన చేసింది. రేపు (బుధవారం) విశాఖపట్నంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది. శ్రీకాకుళంలో ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అరకు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తుండటంతో చాపరాయి సందర్శనను నిలిపివేశారు.

కాగా.. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు మూసివేసి, ప్రస్తుతం 7 గేట్ల ద్వారా 1,87,852 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,24,618 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,80,230 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులుగా ఉంది.

Next Story