సభలో చంద్రబాబు సీక్రెట్ రివీల్ చేసిన ఎమ్మెల్సీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-17 12:36:28  IST  )

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరిలోనూ ఎనర్జీ ఉంటుంది, పిల్లల్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది.

సభలో చంద్రబాబు సీక్రెట్ రివీల్ చేసిన ఎమ్మెల్సీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరిలోనూ ఎనర్జీ ఉంటుంది, పిల్లల్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎనర్జీని సరైనమార్గంలో ఛానలైజ్ చేస్తే మంచి పౌరులుగా ఎదుగుతారని అన్నారు. పిల్లలకు వారంలో కనీసం మూడు రోజులైనా ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో శిక్షణ ఇవ్వాలని కోరారు. నాలుగు గోడల మధ్య చదివీ చదివీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పిల్లలు చాలామంది స్ట్రెస్ గురవుతున్నారు. మానసిక, శారీరక ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, స్ట్రెస్ తట్టుకోలేని కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. గేమ్స్ ఆడడం వలన కొంత స్ట్రెస్ తగ్గుతుందని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్లేగ్రౌండ్స్ ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్‌లో చాలావరకు ప్లేగ్రౌండ్స్ ఉండవు. “Common Play Ground System” CPGS అనే విధానం ప్రవేశపెట్టి ZP పభ్లిక్ స్కూల్స్, మునిసిపల్, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్‌లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మినిమం ఫీస్ Pay చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి, శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సభలో నాగబాబు కీలక ప్రతిపాదన చేశారు.

ఈ తరం పిల్లలకు స్ఫూర్తి

ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీస్ అమౌంట్ పబ్లిక్ స్కూల్స్‌లో సానిటరీ స్టాఫ్, ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత, అవగాహన కూడా ఏర్పడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ తరం పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు ఏడు పదుల వయస్సులో కూడా ఎంతో యాక్టివ్‌‌గా ఉన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే వీరిద్దరు యోగా చేస్తారు. అందుకే ఆరోగ్యంగా, ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో ముఖ్య శాఖల బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధనను కొనసాగిస్తున్నారు. ఇటీవల “టైగర్ ఆఫ్ మార్టియల్ ఆర్ట్స్” అనే అంతర్జాతీయ బిరుదును అందుకున్నారని నాగబాబు గుర్తుచేశారు.

“ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలి..” అని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా.? కేవలం పుస్తక పురుగుల్లాగా వదిలేస్తున్నామా? అనేది తెలుసుకోవాలి. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటి కార్యక్రమాలు కూడా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని ఈ సభ ద్వారా కోరుతున్నాను’ అని నాగబాబు డిమాండ్ చేశారు.

ఏపీ బడ్జెట్... ఓ సంకల్ప పత్రం!

Next Story