నిరూపిస్తే క్షమాపణకు సిద్ధం: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-30 10:45:03  IST  )

కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కౌంటర్‌గా తిరుపతిలో నిరుద్యోగ జేఏసీ నేతలతో కలిసి టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు...

నిరూపిస్తే క్షమాపణకు సిద్ధం: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ(Mega DSC)లో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు(YSR Congress Party Leaders) నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కౌంటర్‌గా తిరుపతి(Tirupati)లో నిరుద్యోగ జేఏసీ నేతలతో కలిసి టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి(TDP MLC Bhumireddy Ramgopal Reddy) మాట్లాడుతూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మెగా డీఎస్సీ(Mega DSC) ద్వారా భర్తీ చేసిన స్పోర్స్ కోటా ఉద్యోగాల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాము క్షమాపణకు సిద్ధమన్నారు. డీఎస్సీ భర్తీ పారదర్శకంగా జరిగిందన్నారు. స్పోర్స్ట్ కోటా ఉద్యోగాలను నిజాయితీగా ఇచ్చామని చెప్పారు. నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ నాయకులు డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story