- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ద్వారానే.. బీసీలకు రాజ్యాధికారం..!
బీజేపీ ద్వారానే.. బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ(Bjp) ద్వారానే బీసీ(Bc)లకు రాజ్యాధికారం సాధ్యమవుతోందని ఎమ్మెల్సీ పోతుల సునీత(Mlc Pothula Sunitha) అన్నారు. గుంటూరు జిల్లా నాయూ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందా బాబ్జీ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. తాను కూడా మూడు నెలల క్రితం బీజేపీలో చేరారని గుర్తు చేశారు. భారత దేశాన్ని ప్రధాని మోడీ(Pm Modi) ప్రపంచంలో అగ్రదేశంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. మోడీ సంస్కరణలు, సుపరిపాలన చూసి తనలాగే చాలా మంది బీజేపీలో చేరుతున్నారని సునీత వ్యాఖ్యానించారు.
అందరం కలిసి బీజేపీ బలోపేతం కోసం కలిసి పని చేస్తామని ఎమ్మెల్సీ పోతుల చెప్పారు. పేదరికం లేని సమాజం కోసం అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇస్తున్నారన్నారు. మన సనాతన ధర్మాన్ని ఇతర దేశాల వారు పాటిస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ మూడు సార్లు వరుసగా ప్రధాని ఉండటం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. ప్రజల బలం ఉంది కాబట్టే హ్యాట్రిక్ విజయం సాధించారని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. బీసీలు చట్ట సభలకు వెళ్లేందుకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీలు ఆర్ధికంగా ఎదగడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళ లకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేలా అందరూ కలిసి పని చేయాలని పోతుల సునీత పిలుపునిచ్చారు.






